ఏపీ డీజీపీ బదిలీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ డీజీపీ బదిలీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారన్నారు. ఆకస్మికంగా  బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? అన్నారు. ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. 

లేని పక్షంలో - విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే  సవాంగ్ గారిపై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టాలన్నారు. ఉద్యోగుల్ని అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. డీజీపీ బదిలీ తీరు చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం గారిని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే తనకు గుర్తుకు వస్తుందన్నారు పవన్ కళ్యాణ్. 

ఇవి కూడా చదవండి: 

దడ పుట్టిస్తున్న కరెంట్ బిల్లులు

కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించిన దేవెగౌడ