Pawan Kalyan: జపాన్ గడ్డపై సత్తా చాటిన పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సమురాయ్!

Pawan Kalyan: జపాన్ గడ్డపై సత్తా చాటిన పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సమురాయ్!

పవన్ కళ్యాణ్‌‌‌‌కు హీరోగా ఎంతటి స్టార్ ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటుడిగానే కాకుండా  రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌గా, కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తనదైన టాలెంట్‌‌‌‌ను ప్రూవ్ చేసుకున్నారు.  అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌‌‌‌లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్.. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఆయనకు ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.

సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత   జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి, అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. ఆయన నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ చిత్రాల్లో ఈ మార్షల్ ఆర్ట్స్‌‌‌‌ను తెరపై చూపించి అభిమానుల మన్నలను పొందారు. మార్షల్ ఆర్ట్స్‌‌‌‌పై పవన్ కళ్యాణ్‌‌‌‌కు ఇప్పటికే  పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందాయి. 

మార్షల్ ఆర్ట్స్ రంగంలో పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు లభించాయి. ఇప్పుడు కెంజుట్సు వంటి అరుదైన జపనీస్ సమురాయ్ ఆర్ట్‌లో అధికారిక గుర్తింపు పొందడం ఆయన ప్రయాణంలో ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఇది కేవలం ఒక సినిమా స్టార్ సాధించిన గౌరవం మాత్రమే కాదు. భారతీయ నటుడు ఒకరు జపనీస్ సంప్రదాయ మార్షల్ ఆర్ట్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణం.