Pawan Kalyan: రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా జనసేన పార్టీ తరుపున రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ విడుదల చేశారు పవన్. ఇందులో భాగంగా ఆయన రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

ఆస్కార్ పురస్కారం అందుకున్న సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. దైవభక్తి మెండుగా ఉన్న రామ్ చరణ్ ఎప్పుడు సానుకూల దృక్పధంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా ఉంటాడు. ఆమె శ్రీరామ రక్షగా నిలుస్తాయి.. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.