వైసీపీ పాదయాత్ర చేస్తే మేం మద్దతిస్తాం

వైసీపీ పాదయాత్ర చేస్తే మేం మద్దతిస్తాం

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తమకు ఓట్లు వేసి గెలిపించకపోయినా.. ప్రజల వెంటే ఉన్నామన్నారు పవన్. తన సినిమాలు ఆపేసి.. ఆర్థిక మూలాలు దెబ్బతియ్యాలని చూశారన్నారు పవన్.  వైసీపీ  నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ అడ్డుకుంటామని పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకుని మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఒక్క రోజు దీక్ష చేశారు పవన్. దీక్ష ముగిసిన తర్వాత  మాట్లాడిన పవన్.. ‘ వైసీపీ ఎంపీలు, చేతకాని ఎంపీలు.  ప్రత్యేక హోదా కోసం నేను రోడ్డు మీదకు వచ్చి తిరిగితే ప్రజల్లో స్పందన లేదు. ప్రజలు కలసి రానప్పుడు నేను ఒక్కడిని ఏం చేస్తాను. ప్రజలు కూడా బయటకు వస్తే ఏదైనా సాధ్యం. నా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు నా సినిమాలు ఆపేస్తే, భయపడుతా అనుకుంటున్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు, అవసరమైతే ఏపీలో ఫ్రీ గా షోలు వేస్తాను. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రయివేటీకరణ ఆపేందుకు నేను పోరాటం చేసి కేంద్రానికి లేఖ రాస్తే వారు ఆపేశారు. అలాంటిది విశాఖ ఉక్కు కోసం  నాయకులు మాట్లాడితే ఎందుకు వినరు? మాట్లాడే ధైర్యం చేయట్లేదా?. ఎన్నికల ముందు పాదయాత్రలు చేశారు కదా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం మరోసారి వైసీపీ నాయకులు పాదయాత్ర చేయండి, మేము మీకు సంఘీభావం తెలియజేస్తాం’ అని అన్నారు.