పాత వాటికి డబ్బులిస్తరు

పాత వాటికి డబ్బులిస్తరు

వేలు పోసి కొన్న బట్టలు కూడా రెండుమూడు సార్లు వేయగానే బోర్​ కొడతాయి కొందరికి . కొన్నిసార్లు ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్​లు వేసుకున్నాక నచ్చకపోవచ్చు కూడా. ఇంట్లోని వస్తువులు, గిఫ్ట్​ ఆర్టికల్స్​ విషయంలోనూ ఈ సమస్య ఉంటుంది. కానీ, పడేయడానికి మనసొప్పక ఇంట్లో  ఏ మూలో భద్రంగా దాచిపెడుతుంటారు వాటిని.ఈ సమస్యకి  సొల్యూషన్​గా వచ్చిందే ఫ్రీఅప్​యాప్​. దీన్ని కర్నాటకకి చెందిన  జిమ్మీ ఇయా 2019లో ​డిజైన్​ చేయించాడు. 2010 లో లగ్సాండర్​ అనే కంపెనీ కూడా పెట్టాడు ఇతను.  అందరికీ తాగు నీళ్లు, చదువు అందాలనుకునే జిమ్మీ సస్టైనబుల్​ లివింగ్​ని ప్రమోట్​ చేయడానికే ఈ యాప్​ని తీసుకొచ్చాడు.

గూగుల్​, యాపిల్​ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్న ఈ యాప్​ గురించి ...
ఈ యాప్​లో  మన దగ్గరున్న వాడకుండా పక్కన పడేసిన వస్తువులతో పాటు పాత వాటిని అమ్మేయొచ్చు. అది కూడా దేశంలో ఏ మూల నుంచైనా. ఇండియా మొత్తం అందుబాటులో ఉన్న ఈ యాప్​లోకి మనం అమ్మాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టాలి. ఆ ఫొటోలకి ఎలాంటి ఎడిటింగ్​ ఎఫెక్ట్స్​​ యాడ్​ చేయొద్దు.. ప్లెయిన్​ బ్యాక్​ గ్రౌండ్​లో ఫొటో తీయాలి. డిస్ర్కిప్షన్​లో వస్తువు కండీషన్​  క్లియర్​గా రాయాలి. ఎంతకి అమ్మాలనుకుంటున్నారన్న విషయం కూడా చెప్పాలి. ఒకవేళ పాడైతే కొనరేమోనన్న భయం అవసరం లేదు. వాటిని రీసైక్లింగ్​ చేసి సేల్​ చేస్తారు. ప్రొడక్ట్స్​ కింద కామెంట్​ సెక్షన్​ కూడా ఉంటుంది. ఎవరైనా వస్తువు కొనాలనుకుంటే ఆ  కామెంట్​ సెక్షన్​ ద్వారా వాళ్లకున్న డౌట్స్​ అడగొచ్చు. యాప్​ ద్వారా ఎవరైనా మన వస్తువుని కొంటే.. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఇంటికొచ్చి దాన్ని తీసుకెళ్తారు. డబ్బులు ఇస్తారు. లేదంటే మనం ఆ యాప్​లో ఏదైనా కొనుక్కునేందుకు కాయిన్స్​ ఇస్తారు.  కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఒకే సిటీలో ఉంటే గంటలో ప్రొడక్ట్​ డెలివరీ చేస్తారు. వేరే ఊళ్లలో ఉంటే మాత్రం ఐదు నుంచి ఆరు రోజుల  టైం పడుతుంది. రీఫండ్​ కూడా ఉంటుంది. రీయూజబుల్​, రీసైక్లింగ్​ ఇంపార్టెన్స్​ తెలియజేయడానికే ఈ యాప్​ని డిజైన్​ చేశారట. ఐదు లక్షలకి పైగా డౌన్​లోడ్స్ ఉన్న ఈ యాప్​లో కేవలం యాక్సెసరీస్​ ఒకటే కాకుండా  ఫోన్స్​, గాడ్జెట్స్​, బుక్స్​, బొమ్మలు, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా చాలానే  అమ్మేయొచ్చు, కొనుక్కోవచ్చు. మరింకెందుకు ఆలస్యం! .