మరో సంక్షోభం : Paytm ఎండీ, సీఈవో రాజీనామా

మరో సంక్షోభం : Paytm ఎండీ, సీఈవో రాజీనామా

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో కీలక పరిణామం జరిగింది. పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురీందర్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ నుండి నిషేధిత చర్యను ఎదుర్కొంటున్న తరుణంలో చావ్లా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చావ్లా వ్యక్తిగత కారణాల వల్ల మరియు మెరుగైన కెరీర్ అవకాశాలను అన్వేషించడం కోసం ఏప్రిల్ 8, 2024న తన రాజీనామాను సమర్పించారని యాజమాన్యం తెలిపింది.

 జూన్ 26, 2024న వ్యాపార వేళలు ముగిసే వరకు అతను పీపీబీఎల్(పేటీఎం పేమెంట్స్ బ్యాంక్) నుండి రిలీవ్ అవుతాడు. పరస్పర అంగీకారంతో సీఈఓ రాజీనామాను ఆమోదించడం జరిగిందని పేటీఎం పేరెంటిగ్ సంస్థ One97 కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు.