
అణగారిన వర్గాల గొంతుకగా, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత కాకా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకట స్వామి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకా చూపిన మార్గం, ఆయన విలువలు, సమానత్వం, న్యాయం, సేవ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో కాకాకీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు పీసీసీ చీప్. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం 1949లో ‘జాతీయ గుడిసెల సంఘం’ను స్థాపించి హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కార్మికుల పక్షపాతిగా కాకా చేసిన సేవలు అద్భుతమని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల పట్ల కాకాకు ఉన్న పేగు బంధాన్ని స్మరించుకుంటూ, కేంద్ర మంత్రిగా సింగరేణి కార్మికుల ఐటీ మాఫీ చేయాలని పార్లమెంట్‌లో కోరిన మొదటి నేతగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా కాకా జీవించారని, నేటి తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పేదల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కాకా ఆలోచనలు సామాజిక సమానత్వ సాధనలో మనకు దిశానిర్దేశం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.