రుణమాఫీ.. రైతుబంధు ఇయ్యలే- ఇంకా ఏం శుభవార్త చెప్తవ్?  

రుణమాఫీ..  రైతుబంధు ఇయ్యలే- ఇంకా ఏం శుభవార్త చెప్తవ్?  

సీఎం కేసీఆర్ పై
పీసీసీ చీఫ్​ ఉత్తమ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘‘రైతులకు శుభవార్త అంటున్న సీఎం కేసీఆర్​కు సిగ్గుండాలె. రైతులకు పంట రుణాలను మాఫీ చేయడంలేదు. రైతు బంధు ఇవ్వడంలేదు. పంట నష్ట పరిహారం ఇవ్వడంలేదు. ఇప్పుడున్న పథకాలే అందడంలేదు. ఇంకా రైతులకు శుభవార్త  ఏందీ?  రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా?” అని పీసీసీ చీఫ్​ఉత్తమ్​కుమార్​రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం కాంగ్రెస్​ జడ్పీటీసీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద గతంలో ఉన్నదాని కంటే అదనంగా ఒక్క ఎకరానికీ నీరు అందలేదన్నారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతోనే పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా 20 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని, ఈ ప్రాజెక్టు కింద పండిన పంటను కాళేశ్వరం కింద పండినట్లుగా కేసీఆర్​ చూపిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్ లకు, మండల పరిషత్తులకు నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందన్నారు. టీఆర్ఎస్​ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కేడర్ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..