వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని జగిత్యాలకు తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలని పీడీఎస్యూ లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. పాలిటెక్నిక్ కాలేజీని జగిత్యాల కాలేజీలో విలీనం చేయడానికి ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారని తెలిపారు.
జిల్లాలోని ఒకే ఒక్క అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌ను తరలించడం సరికాదన్నారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఆర్ గౌతం కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్, అక్బర్ నగర్ సర్పంచ్ సీతారాం రాజు, ఉప సర్పంచ్ హబీబ్ ఖాన్, నగేశ్, సంజీవులు, సాయిలు పాల్గొన్నారు.
