మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. విడుదలకు ముందే ఈ మూవీ టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం గ్లింప్స్‌లతోనే ప్రకంపనలు సృష్టించిన ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం గేర్ మార్చింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ అభిమాని రాసిన బహిరంగ లేఖకు స్పందించిన మేకర్స్, అందరినీ ఆశ్చర్యపరిచేలా ‘పెద్ది పవర్ ప్లే టూర్’ (Peddi Powerplay Tour) పేరుతో ఒక భారీ ప్రమోషనల్ ప్లాన్‌ను ప్రకటించారు.
ముంబైలో ట్రైలర్ లాంచ్..
జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం కేవలం 15 రోజుల్లోనే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయనున్నారు. ఈ యాత్ర మే 18న ముంబైలో మొదలవుతుంది. అక్కడ అత్యంత భారీగా ‘పెద్ది’ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. కుస్తీ వీరుడిగా, క్రికెటర్‌గా చరణ్ విశ్వరూపాన్ని ఈ ట్రైలర్‌లో చూడబోతున్నామనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఉప్పల్ స్టేడియం షేక్..
ప్రమోషన్లలో అత్యంత ఆసక్తికరమైన అంశం మే 22న ఉప్పల్ స్టేడియంలో ప్లాన్ చేసిన ఈవెంట్. ఐపీఎల్‌లో భాగంగా ఆరోజు జరిగే RCB vs SRH మ్యాచ్ మధ్యలో రామ్ చరణ్ సందడి చేయబోతున్నారు. అదే వేదికపై ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌తో స్టేడియం దద్దరిల్లిపోనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో ఈ రకమైన పబ్లిసిటీ ఇండియాలో మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోంది.
►ALSO READ | RashmikaVijay: మెస్సీ, రొనాల్డో రికార్డులు బద్దలు.. గ్లోబల్ రేంజ్‌లో విజయ్-రష్మిక ప్రకంపనలు!
నార్త్ టు సౌత్ వరకు ప్రమోషన్స్..
హైదరాబాద్ తర్వాత ఈ జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా మే 23న భోపాల్‌లో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. మే 24న బెంగళూరు ప్రెస్ మీట్ , మే 28 ఢిల్లీలో అదే విధంగా మే 30 చెన్నై నగరాల్లో భారీ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. కథా నేపథ్యమైన విజయనగరంలో జూన్ 1న అభిమానులతో గెట్-టుగెదర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫైనల్ గా జూన్ 2న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు..
#PEDDI - Mana Cinema Aadukodam Gurinche 💥
— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026
Get ready for the games 🥰
In cinemas JUNE 4th ❤️ https://t.co/f41uSE09yc pic.twitter.com/4QChYp8BxW
జూన్ 4న థియేటర్లలో సమరం!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ గతంలో ఎన్నడూ చూడని మేకోవర్‌లో కనిపిస్తున్నారు. 8 రోజుల్లో 7 నగరాల్లో ప్రమోషన్లు అంటే ఇది మామూలు విషయం కాదు. నిజమైన ‘పాన్ ఇండియా’ విజువల్ ట్రీట్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘పెద్ది’ రాకతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
