RashmikaVijay: మెస్సీ, రొనాల్డో రికార్డులు బద్దలు.. గ్లోబల్ రేంజ్‌లో విజయ్-రష్మిక ప్రకంపనలు!

RashmikaVijay: మెస్సీ, రొనాల్డో రికార్డులు బద్దలు.. గ్లోబల్ రేంజ్‌లో విజయ్-రష్మిక ప్రకంపనలు!

టాలీవుడ్ మోస్ట్ లవ్లీ అండ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ విరోష్ జంట సోషల్ మీడియాలో మరోసారి గ్లోబల్ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉండి, ఈ ఏడాది ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి పీటలెక్కారు ఈ రియల్ లైఫ్ జోడీ. ఇప్పుడు పెళ్లయ్యాక కూడా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో ఇంటర్నేషనల్ రికార్డులను తిరగరాస్తోంది.

మిలియన్స్ లో లైకులు..

లేటెస్ట్ గా ఈ జంట కలిసి నటించిన ప్రముఖ ‘ఎయిర్‌బీఎన్‌బీ’ (Airbnb) కపుల్ యాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఈ క్యూట్ యాడ్ పోస్టుకు ఏకంగా 9.1 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాలో ఒక బ్రాండ్ యాడ్‌కు ఈ స్థాయిలో లైక్స్ రావడం ఇది రెండోసారి మాత్రమే!

రికార్డులు ‘విరోష్’ ఖాతాలోనే!

ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ గ్లోబల్ లిస్టులో మొదటి స్థానం రికార్డ్ కూడా ఈ క్రేజీ జంటదే కావడం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘మాన్యవార్’ వెడ్డింగ్ క్యాంపెయిన్ యాడ్‌కు 11.5 మిలియన్ల లైక్స్, 104 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి చేసిన లూయిస్ విట్టన్ (Louis Vuitton) వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్ రికార్డులను కూడా ఈ టాలీవుడ్ జోడీ బద్దలు కొట్టడం ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

‘రణబాలి’తో రచ్చ!

పెళ్లి తర్వాత కూడా ఈ క్రేజీ కపుల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ సినిమా చేస్తుండగా.. రష్మిక బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో ‘కాక్‌టెయిల్ 2’, తెలుగులో ‘మైసా’ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతోంది. అయితే, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్కీ ఛాన్స్ రానే వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చిత్రంలో విజయ్-రష్మిక మళ్లీ జంటగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వెండితెరపై వీరిద్దరి రియల్ కెమిస్ట్రీని చూడటానికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వెయిట్ చేస్తున్నారు.

►ALSO READ | పెళ్లిళ్లతో 17 ఏళ్లు వేస్ట్ చేసుకున్నా.. 44 ఏళ్ల వయస్సులో మలయాళి నటి షాకింగ్ కామెంట్స్.!