ఐదు బిజినెస్‌‌‌‌లపై పెన్నార్ ఫోకస్‌‌‌‌

ఐదు బిజినెస్‌‌‌‌లపై పెన్నార్ ఫోకస్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : చైర్మన్‌‌‌‌గా ఎన్నికైన ఆర్‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌ రామకృష్ణ నాయకత్వంలో గ్లోబల్ లెవెల్ కంపెనీగా ఎదుగుతామని పెన్నార్ ఇండస్ట్రీస్ పేర్కొంది. నుపేందర్‌‌‌‌‌‌‌‌ రావు స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.  తొమ్మిదికి పైగా బిజినెస్‌‌‌‌లలో ఉన్న కంపెనీ ఇక నుంచి ఐదు సెగ్మెంట్లపై ఎక్కువ ఫోకస్ పెడతామని వెల్లడించింది. ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్‌‌‌‌ (పీఈబీ), టూబ్స్‌‌‌‌, హైడ్రాలిక్స్‌‌‌‌, ఇంజినీరింగ్ సర్వీసెస్‌‌‌‌, ప్రాసెస్ అండ్ హీటింగ్ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లపై ఎక్కువ ఫోకస్ పెడతామంది. రిటైల్‌‌‌‌ (డైరెక్ట్‌‌‌‌గా కన్జూమర్లకు తన ప్రొడక్ట్‌‌‌‌లు అమ్మడం), సోలార్‌‌‌‌‌‌‌‌ మాడ్యుల్స్ తయారీ వ్యాపారాలను క్లోజ్ చేసేశామని పెన్నార్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్ చైర్మన్  రామకృష్ణ పేర్కొన్నారు.

మిగిలిన రెండు  బిజినెస్‌‌‌‌ల నుంచి కూడా తప్పుకోవడమో లేదా మూసేయడమో చేస్తామని, దీనిపై బోర్డ్ నిర్ణయం తీసుకున్నాక ప్రకటిస్తామని  అన్నారు. పెన్నార్ ఇండస్ట్రీస్‌‌‌‌  2016 లో పెన్నార్ గ్లోబల్‌‌‌‌ ఏర్పాటు చేసింది. అసెంట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌తో నార్త్‌‌‌‌ అమెరికాలో వ్యాపారం చేస్తోంది. తాజాగా యూరోపియన్ ఏరోస్పేస్ కంపెనీ కాడ్నంను కొనుగోలు చేసింది. కంపెనీకి  కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.2,894 కోట్ల రెవెన్యూ వచ్చింది.  ట్యాక్స్‌‌‌‌లు చెల్లించకముందు కంపెనీ ప్రాఫిట్‌‌‌‌ రూ.98.4 కోట్లుగా ఉంది. కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ. 44.17 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌‌‌తో పోలిస్తే 45 శాతం ఎక్కువ.