అర్హులైన అందరికీ పింఛన్ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన అందరికీ  పింఛన్ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి,వెలుగు :  ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావులేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో పలు గ్రామాల్లో ప్రజల  నుంచి సమస్యల వినతిపత్రాలను స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ .  అర్హులైన  అందరికీ పింఛన్లు అందుతాయని  హామీ ఇచ్చారు.  కూసుమంచి మండలంలో పోచారం గ్రామంలో మాజీ ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి తల్లి పద్మమ్మ చనిపోవడంతో మంత్రి పొంగులేటి   నివాళ్లు అర్పించారు.  

ఖమ్మం : ప్రాచీన కళలకు  ఆదరణ ఉంటుందని   మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  పేర్కొన్నారు. నటరాజ నృత్య కళానికేతన్ 48వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో  నృత్య ప్రదర్శనలు చేసిన సందర్భంగా పలువురు చిన్నారులకు  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సందర్భంగా వారిని   తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్టార్ ఎస్. మాధవరావు , సీనియర్ జర్నలిస్టు మాధవరావు
 యెగినాటి  పాల్గొన్నారు.