దేశ వ్యాప్తంగా టపాసుల మోత..

దేశ వ్యాప్తంగా టపాసుల మోత..

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాణసంచా మోత మోగుతోంది. పిల్లలు పెద్దలు. టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున టపాసుల కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే  ఈ సంవత్సరం పటాకుల ధరలు భారీగా పెరిగినా జనం తగ్గడం లేదు. కొనుగోలుదారులతో  బాణసంచా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పిల్లల సంతోషం కోసం టపాసులు  కొనుగోలు చేస్తున్నారు.

అయితే  హైదరాబాద్ లో  పోలీసులు టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పండుగ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు  మాత్రమే టపాసులు కాల్చాలని  రూల్స్ పెట్టారు.  ఈ ఆంక్షలు  నవంబర్ 12 ఉదయం 6 నుండి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.

 

మరో వైపు  దీపావళి సందర్భంగా యూపీలోని అయోద్య నగరం దీపకాంతులతో  వెలిగిపోతోంది. లక్షలాది దీపాలతో అయోధ్య అద్భుతంగా ,అపూరూపంగా కనిపిస్తోంది. . ఈకాంతుల నుంచి వచ్చే వెలువడే శక్తి దేశంలో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది.