జగిత్యాల జిల్లాలో మొసలి కలకలం

జగిత్యాల జిల్లాలో మొసలి కలకలం

జగిత్యాల జిల్లాలో మొసలి కలకలం రేపింది. మల్లాపూర్ మండలం కొత్త దామరాజుపల్లి శివారులోని ఓ గొర్రె పిల్లను చంపేసింది మొసలి. పెద్ద చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చి గొర్రె పిల్లను లోపలికి లాక్కెళ్లింది. మొసలి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో ఈ సమాచారం దావానలంలా పాకింది. చెరువు దగ్గర మొసలి సంచారం జరుగుతోందన్న వార్తలతో  గొర్రె కాపర్లు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో అధికారులు స్పందించారు. మొసలిని పట్టి బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

సిద్ధూ కుటుంబాన్ని ఇవాళ పరామర్శించనున్న రాహుల్ గాంధీ

ఎలక్ట్రిక్ వాహనాల వైపు.. ఢిల్లీ ఎయిర్పోర్టు చూపు

రెండు కుక్కల పెళ్లి.. 500 మందితో ఊరేగింపు