కర్నాటక కేటాయింపులకు లోబడే.. అప్పర్​ భద్రకు అనుమతులు

కర్నాటక కేటాయింపులకు లోబడే.. అప్పర్​ భద్రకు అనుమతులు

హైదరాబాద్, వెలుగు : బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ –1) కర్నాటకకు చేసిన కృష్ణా నీటి కేటాయింపులకు లోబడే అప్పర్​భద్ర ప్రాజెక్టుకు అనుమతులిచ్చామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని  హై పవర్ ​స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమతో పాటు కృష్ణా బేసిన్​లోని వివిధ రీజియన్​లకు చేసిన నీటి కేటాయింపులపై అప్పర్​భద్ర ప్రభావం చూపబోదన్నారు. ఏదైన రాష్ట్రం తమకు చేసిన కేటాయింపులకు లోబడి ప్రాజెక్టు చేపడితే దానికి అనుమతులివ్వడానికి ఇంటర్ స్టేట్ అంశాలను పరిగణలోకి తీసుకొని తీరాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో లేదన్నారు.