టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా ? : పేర్ని నాని

టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా ?  : పేర్ని నాని

టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. 175 నియోజకవర్గాల్లో జనసేనకు,  రాహుల్‌ గాంధీకి ఎన్ని ఇస్తారో క్లారిటీ ఉందా? అని ప్రశ్నించారు. పదిమందిని కలుపుకుంటే కానీ పోటీ చేయలేని పరిస్థితి చంద్రబాబుదని విమర్శించారు. జగన్ తో పోటీ పడే దైర్యం చంద్రబాబుకు లేదన్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు పులివెందులలో పోటీ చేసే దమ్ముందా అని పేర్ని నాని ప్రశ్నించారు. వై నాట్  పులివెందుల అనే ప్రతి ఒక్కరిని తాను అహ్వానిస్తున్నానని చెప్పారు. నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో గెలిచి ప్రపంచాన్ని జయించినట్లు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. 22 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 గెలిచి ఇంత సంబరం అవసరమా అని ప్రశ్నించారు.