
ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు కడుతూ ఓ యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనురు గ్రామానికి చెందిన సుగుణారావ్ అనే యువకుడు గ్రామంలో గురువారం రాత్రి ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ బర్త్‌డే రోజు కూడా ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు చనిపోయిన విషయం తెలిసిందే.
For More News..