ఫుట్ బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు గురై ఆటగాడు మృతి

ఫుట్ బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు గురై ఆటగాడు మృతి

పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిడుగుపాటుకు గురై ఓ ఆటగాడి చనిపోయాడు. పెరూలోని జువెంటుడ్ బెల్లావిస్టా, హువాన్‌కాయోలోని ఫామిలియా చొక్కా అనే రెండు క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. కొంతమంది ఆటగాళ్లు కూడా గాయపడినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో విచారాన్ని కలిగిస్తుంది. 

మ్యాచ్ సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. ఆటగాళ్లు మైదానం వీడడం ప్రారంభించగానే పిడుగు పడడంతో 39 ఏళ్ల సాకర్ ప్లేయర్ జోస్ హ్యూగో డి లా క్రూజ్ మెసా గ్రౌండ్ లో కుప్పకూలి మరణించాడు. గాయపడిన ఇతర ఆటగాళ్లను ఆసుపత్రికి తరలించారు.