బుసలు కొడుతూ యజమానిని కాటేసిన పాము

బుసలు కొడుతూ యజమానిని కాటేసిన పాము

చాలామంది పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువమంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కుక్కలను మాత్రమే కాదు అన్ని రకాల జంతువులను పెంచుకుంటున్నారు. వాటితో సరదాగా సమయం గడుపుతున్నారు. అవి కుదురుగా ఉంటే ఇబ్బంది లేదు.. కానీ అప్పుడప్పుడు పెంపుడు జంతువులు కూడా యజమానిపై దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పెంపుడు జంతువు అయిన పామును... బోనులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించి కాటుకు గురైంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక మహిళ పంజరం మూతను తొలగించేందుకు ప్రయత్నించగా.. అందులో పాము బుసలు కొడతూ ఆమె చేతిపై కాటు వేసింది. కొద్ది సెకన్లలోనే  ఆమె చేతిని కొరికి.. భుజం చుట్టూ చుట్టుకుపోయింది. పామును తిరిగి మూతలో పెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన మరో వ్యక్తి కూడా పామును వదిలించలేకపోయాడు. అప్పటికే ఆమె చేతికి తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. ఈ వీడియోను అతడు ట్విట్టర్ లో పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.