పెళ్లి ఖర్చుల కోసం కొత్త PF విత్ డ్రా స్కీం : ఆనందంలో సేవింగ్స్ ఆవిరి

పెళ్లి ఖర్చుల కోసం కొత్త PF విత్ డ్రా స్కీం : ఆనందంలో సేవింగ్స్ ఆవిరి

పదవి విరమణ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల కోసం డబ్బు తీసుకునే (withdraw) నిబంధనలను మరింతగా సులభం చేయాలని నిర్ణయించారు. అంటే  పీఎఫ్ కస్టమర్లు వాళ్ళ  అకౌంట్ మెచ్యూర్ అవ్వకముందే గతంలో అనుమతించిన దానికంటే ఎక్కువసార్లు డబ్బు విత్ డ్రా  చేసుకోవచ్చు.

అయితే, EPS-95 కింద కనీస పెన్షన్‌ ప్రస్తుతమున్న రూ.1,000 నుండి రూ.2,500కి పెంచవచ్చనే చర్చ జరిగినా, నిర్ణయం తీసుకోలేదు. బోర్డు తీసుకున్న ఈ విత్ డ్రా నిబంధన ప్రజలకు ఆర్థికంగా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ  మార్పులు ఏంటంటే....   

EPFO తీసుకున్న చర్యలు : పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తీసుకునే పరిమితి 5కి పెంచారు. అంటే పెళ్లి ఖర్చుల కోసం మీ సర్వీస్ కాలంలో మీ పీఎఫ్ అకౌంట్లో  ఉన్న డబ్బును 5 సార్లు తీసుకోవచ్చు. అలాగే, పిల్లల చదువుల ఖర్చుల కోసం పీఎఫ్ బ్యాలెన్స్‌లో  నుండి 10సార్లు  తీసుకోవచ్చు. ఇంతకుముందు పెళ్లి, చదువు  రెండింటి కోసం కేవలం 3 సార్లు మాత్రమే డబ్బు తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది. అలాగే కనీస పని అనుభవం అంటే సర్వీస్ కాలం అవసరం కూడా తగ్గింది. 

Also Read : హిందూ సాధువుకోసం..మదీనాలో ముస్లిం యువకుడి ప్రార్థనలు..వీడియో వైరల్

 పెళ్లి, చదువుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అంటే క్యాన్సర్, టీబీ, గుండె జబ్బులు, పక్షవాతం, కుష్టు వ్యాధి వంటి ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్  ఖర్చులు కోసం పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే, కనీస పని అనుభవం కేవలం 12 నెలలు (ఒక సంవత్సరం) మాత్రమే ఉంటే సరిపోతుంది.  గతంలో, పీఎఫ్ డబ్బు తీసుకునే కారణాన్ని బట్టి, అవసరమైన కనీస సర్వీస్ కాలం వేర్వేరుగా ఉండేవి.

ప్రత్యేక పరిస్థితులు: పీఎఫ్ సభ్యులు ప్రత్యేక పరిస్థితులు అనే కేటగిరీ కింద డబ్బు తీసుకోవడానికి, ప్రత్యేకంగా కారణాన్ని తెలపాల్సిన అవసరం లేదు. గతంలో ప్రత్యేక పరిస్థితుల కింద డబ్బు తీసుకోవాలంటే కారణాన్ని అంటే ఆఫీసు మూసేయడం, ఉద్యోగం దొరక్కపోవడం వంటివి స్పష్టంగా చెప్పాల్సి వచ్చేది.

కొత్త నిబంధన : EPFO కొత్తగా ఒక రూల్  కూడా తీసుకొచ్చింది.  పీఎఫ్ ఉన్నవాళ్లు  వాళ్ళ అకౌంట్లో  కనీస బ్యాలెన్స్‌ ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. అంటే మీ PF మొత్తం జమలో (contribution) 25%కి సమానంగా ఉండాలి.