
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తన టోసిలిజుమాబ్ బయోసిమిలర్ క్యాండిడేట్ డీఆర్ఎల్–టీసీ కోసం చేపట్టిన ఫేజ్-–1 స్టడీని పూర్తి చేసింది. ప్రైమరీ, సెకండరీ ఎండ్ పాయింట్లను విజయవంతంగా చేరుకున్నట్లు పేర్కొంది. ఫేజ్–-1 స్టడీలో టోసిలిజుమాబ్ బయోసిమిలర్ క్యాండిడేట్ఫార్మకోకైనటిక్ ఈక్వలెన్స్, భద్రత, ఇమ్యునోజెనిసిటీని రిఫరెన్స్ ప్రొడక్టులతో పోల్చి అంచనా వేయడానికి ఇంట్రావీనస్ (4) ఫార్ములేషన్ ఉపయోగించారు. టోసిలిజుమాబ్.. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ- రుమటిక్ ఏజెంట్ అని సంస్థ బయోలాజిక్స్ గ్లోబల్ హెడ్ డాక్టర్ జయంత్ శ్రీధర్ అన్నారు. ఇందుకోసం సబ్‌కటానియస్, ఇంట్రావీనస్ ఫార్ములేషన్‌లలో ఫార్ములేషన్‌ను అభివృద్ధి చేశామని అన్నారు.