
క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. కానీ స్టన్నింగ్ క్యాచ్ లు మాత్రమే ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కు పిచ్చ పైకి ఇస్తున్నాయి. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేస్తున్నారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ది హండ్రెడ్ లీగ్ లో నమోదయింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్ పిల్ సాల్ట్ ది హండ్రెడ్‌లో ది బెస్ట్ క్యాచ్ అందుకున్నాడు.
సాల్ట్ పట్టిన ఈ క్యాచ్ సూపర్ మ్యాన్ ను తలపిస్తుంది. క్యాచ్ ఇలా కూడా పడతారా అనే కొత్త అనుమానం మనలో కలుగుతుంది. హండ్రెడ్ లీగ్ లో భాగంగా బుధవారం (ఆగస్టు 20) నాటింగ్‌హామ్‌లో ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఊహకందని క్యాచ్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. ట్రెంట్ రాకెట్స్ ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఈ అద్భుతమైన క్యాచ్ చోటు చేసుకుంది. 48వ బంతికి జోష్ టంగ్ వేసిన ఒక స్లో డెలివరీని మాక్స్ హోల్డెన్ చిన్నగా పుష్ చేశాడు. మిడాఫ్ కు దూరంగా ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ చాలా షార్ప్ గా ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు.
►ALSO READ | Asia Cup 2025: ఏడాది టీ20 జట్టుకు దూరమైనా గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్య
దూరంగా వెళ్తున్న బంతిని చేతివేళ్ళతో పట్టుకున్న సాల్ట్.. కింద పడిన తర్వాత కూడా బంతిని జారనివ్వకుండా చేతిలో భద్రంగా ఉంచాడు. ఈ సమయంలో సాల్ట్ బాడీ ఫ్లెక్సిబిలిటీను చూస్తే షాక్ అవ్వాల్సిందే. హండ్రెడ్ లీగ్ లోనే ఇదొక బెస్ట్ క్యాచ్ ల్లో ఒకటిగా చెప్పుకొస్తున్నారు. సాల్ట్ విన్యాసం చేసి అందుకున్న ఈ స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాంచెస్టర్ ఒరిజినల్స్ పై ట్రెంట్ రాకెట్స్ 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో కేవలం 98 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ట్రెంట్ రాకెట్స్ 74 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి విజయం సాధించింది.
Quite an extraordinary catch from Phil Salt last night in #TheHundred
— Cricbuzz (@cricbuzz) August 20, 2025
😲😲😲pic.twitter.com/t2hgcb12xq