Asia Cup 2025: ఏడాది టీ20 జట్టుకు దూరమైనా గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్య

Asia Cup 2025: ఏడాది టీ20 జట్టుకు దూరమైనా గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్య

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు నెల రోజుల పాటు విరామం లభించింది. వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ తో మళ్ళీ క్రికెట్ బాట పట్టనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ జరగబోతుంది. ఈ కాంటినెంటల్ టోర్నీకి 20 రోజుల సమయం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడనున్న పెద్ద టోర్నీ ఇదే. ఈ మెగా టోర్నీకి టీమిండియా సూర్య కుమార్ యాదవ్ నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్సీ అక్షర్ పటేల్ లేదా హార్దిక్ పాండ్యకు దక్కుతుందనుకుంటే యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు సెలక్టర్లు ఓటేశారు.

ఆసియా కప్ కు భారత జట్టును మంళవారం (ఆగస్టు 19) బీసీసీఐ ప్రకటించింది. మొదట నుంచి ఆసియా కప్ స్క్వాడ్ లో గిల్ కు ఛాన్స్ దక్కడం కష్టమే అనుకున్నారు. సంవత్సరం పాటు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడకపోవడం ఒక కారణమైతే.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, జైశ్వాల్ ను కాకుండా గిల్ కు అవకాశం దక్కడం అసాధ్యమనే ప్రచారం జరిగింది. అయితే అందరికీ షాకిస్తూ సెలక్టర్లు గిల్ కు టీమిండియా స్క్వాడ్ లో చోటు ఇవ్వడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సంవత్సరం పాటు టీ20 క్రికెట్ ఆడకపోయినా గిల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించడంపై నెటిజన్స్ షాక్ అవుతున్నారు. 

►ALSO READ | శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చోటు కల్పించడం కష్టం: చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్క్వాడ్ ప్రకటించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ గిల్ వైస్ కెప్టెన్సీకి ఇవ్వడంపై ప్రశ్న అడిగారు. దీనికి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు. సూర్య మాట్లాడుతూ.." గిల్ ఇంతకముందే టీ20 వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు శ్రీలంక టూర్ కు వెళ్ళినప్పుడు గిల్ వైస్ కెప్టెన్. అప్పుడు నేను కెప్టెన్సీ చేస్తున్నాను. ఆ తర్వాత గిల్ టెస్ట్ క్రికెట్ తో బిజీగా మారాడు. ఈ ఏడాది బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీలతో బిజీగా మారాడు. అతను జట్టులోని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది". అని సూర్య చెప్పుకొచ్చాడు. 

గిల్ కు వైస్ కెప్టెన్సీ నిర్ణయం టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‎ను కాస్తా నిరాశకు గురి చేసింది. టీమిండియా చివరగా ఇంగ్లాండ్‎తో టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‎కు భారత టీ20 వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను ఎంపిక చేశారు. తాజాగా ప్రకటించిన ఆసియా కప్ జట్టులో మరోసారి టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ మారారు. అక్షర్ పటేల్‎ను పక్కకు పెట్టి.. ఇటీవల భారత టెస్ట్ జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టిన శుభమన్ గిల్‎కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. దీంతో ఒక్క సిరీస్ కే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

2025 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా