ఇంజనీరింగ్ కోర్సులో కంపల్సరీ సబ్జెక్ట్ గా ఫిలాసఫీ

ఇంజనీరింగ్ కోర్సులో కంపల్సరీ సబ్జెక్ట్ గా ఫిలాసఫీ
  • బీటెక్, ఎంటెక్ లలో తప్పనిసరి చేసిన అన్నా యూనివర్సిటీ

చెన్నై: ఇంజనీరింగ్ కోర్సుల్లో ఫిలిసఫీ (తత్వ శాస్త్రం) సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేషన్ తోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోనూ కంపల్సరీగా ఈ సబ్జెక్టును బోధించాలని ఆ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు సూచించింది. ఈ సబ్జెక్టు సిలబస్ ను కూడా రూపొందించింది.

బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు మూడో సెమిస్టర్ లో ఫిలాసఫీ సబ్జెక్టు బోధిస్తారని వీసీ ఎంకే సూరప్ప తెలిపారు. ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ లో దీనిపై చర్చిస్తానని, అన్ని వర్సిటీల్లో ఇది ఒక చాయిస్ లా ఉండాలని ఆయన అన్నారు. దీనిపై త్వరలో సవరణ తీసుకొస్తామని చెప్పారు.

భారత, పాశ్చాత్య సంప్రదాయాలను పోలుస్తూ..

అన్నా యూనివర్సిటీ ఫిలాసఫీ సబ్జెక్టుకు రూపొందించిన సిలబస్ లో ఉపనిషత్తులు, భగద్గీత, వేదాలు, యోగా అధ్యయనం ఉంటాయని సర్క్యులర్ లో అధికారులు వెల్లడించారు. అలాగే భారత ప్రాచీన సంప్రదాయాలతో పాటు పాశ్చాత్య సంప్రదాయాలు, ప్లాటో, ఫ్రాన్సిస్ బెకాన్ థియరీలు వంటివి సిలబస్ లో ఉంటాయని చెప్పారు. భారత, పాశ్చాత్య సంప్రదాయాల మద్య భేదాలను, పోలికలను విద్యార్థులు అర్థం చేసుకునేలా ఫిలాసఫీ బోదన ఉంటుందన్నారు.