ఆరోగ్య సేతు యాప్ పై ఫిషింగ్ అటాక్స్: సీఈఆర్ టీ–ఇన్

ఆరోగ్య సేతు యాప్ పై ఫిషింగ్ అటాక్స్: సీఈఆర్ టీ–ఇన్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులను వినియోగించుకోవడానికి సైబర్ క్రిమినల్స్ అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్ పై కొందరు ఫిషింగ్ అటాక్స్ కు పాల్పడుతున్నారని ఇండియా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్ టీ–ఇన్ తెలిపింది. ‘ఆరోగ్య సేతు యాప్ పై ఫిషింగ్ దాడులు ఎక్కువయ్యాయి. హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్, సీఈఓ లేదా వేరే వ్యక్తిలా మెసేజెస్ చేస్తూ యూజర్స్ ను టార్గెట్ చేస్తున్నారు. మీ పొరుగు వారికి వైరస్ సోకింది, ఎవరెవరికి వైరస్ సోకిందో తెలుసుకోండి, మీతో కాంటాక్ట్ లో ఉన్న వారికి టెస్టుల్లో పాజిటివ్ గా వచ్చింది, సెల్ఫ్​ఐసోలేషన్ లో ఉండటానికి సూచనలు, ఆరోగ్య సేతు నుంచి గైడ్ లైన్సె స్ లాంటి మెసేజులతో యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. మెసేజ్ వచ్చిన ఫోన్ లో రిసీపింట్స్ ఆ మెసేజులపై క్లిక్ చేస్తే కొంత సమాచారం ఇవ్వాల్సిందిగా సైబర్ క్రిమినల్స్ అడుగుతారు. అవి వ్యక్తిగతమైనవి కావొచ్చు లేదా ఆర్థికమపరమైనవి అవ్వొచ్చు. ఎక్కువగా ఈ తరహా వెబ్ సైట్స్ యూజర్లకు సంబంధించిన బ్యాంక్, క్రెడిట్ కార్డ్ కంపెనీ, పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ను అడుగుతాయి. రిలీఫ్ ప్యాకేజీ, కరోనా టైమ్ లో సేఫ్టీ టిప్స్, కరోనా టెస్టింగ్ కిట్, కరోనా వ్యాక్సిన్, కరోనా టైమ్ లో విరాళం లాంటి పేర్ల మీద కొత్తగా ఫిషింగ్ డొమైన్స్ ను క్రిమినల్స్ క్రియేట్ చేస్తున్నారు’ అని సీఈఆర్ టీ–ఇన్ పేర్కొంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో మన దేశంలో బలమైన చట్టాలు లేవని, ఫిషింగ్ ఐటీ యాక్ట్ పరిధిలోకి రాదని ప్రముఖ సైబర్ ఎక్స్ పర్ట్ పవన్ దుగ్గల్ చెప్పారు. ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ తగినంత సెక్యూర్ గా లేదన్నారు.