న్యూఢిల్లీ: డెకాకార్న్ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే జనరల్ అట్లాంటిక్ నుండి 100 మిలియన్ డాలర్లు అదనపు పెట్టుబడిని పొందింది. జనరల్ అట్లాంటిక్‌తో పాటు మరికొందరు–ఇన్వెస్టర్లు 12 బిలియన్ డాలర్ల ప్రీ–మనీ వాల్యుయేషన్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న బిలియన్ ఫండింగ్ రౌండ్‌లో 550 మిలియన్ డాలర్లు అందించారు.
ఈ డబ్బును బిజినెస్ విస్తరణకు ఉపయోగిస్తామని, జనరల్ అట్లాంటిక్‌కు తమపై ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడి నిదర్శనమని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. జనరల్ అట్లాంటిక్ నుండి ఈ తాజా ప్రైమరీ ఇన్ఫ్యూషన్‌తో, ఫోన్‌పే ప్రస్తుత రౌండ్‌లో మొత్తం 850 మిలియన్ డాలర్ల ప్రైమరీ క్యాపిటల్‌ను సేకరించింది.
