కేజ్రీవాల్‌‌‌‌ను సీఎం పదవి నుంచి తప్పించాలి.. ఢిల్లీ హైకోర్టులో పిల్

కేజ్రీవాల్‌‌‌‌ను సీఎం పదవి నుంచి తప్పించాలి.. ఢిల్లీ హైకోర్టులో పిల్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని అరెస్టు చేసిన నేపథ్యంలో సీఎం పదవి నుంచి తొలగించాలని సూర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పిటిషన్​దాఖలు చేశారు. కేజ్రీవాల్ ఏ అధికారంతో ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నారో వివరించాలని.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రశ్నించాలని ఆయన తన పిటిషన్‌‌‌‌లో డిమాండ్ చేశారు.

ఈ కేసులో బలవంతపు చర్య నుంచి తనకు రక్షణ కల్పించాలన్న కేజ్రీవాల్​ అభ్యర్థనను గురు వారం తోసిపుచ్చిన అంశాన్ని కూడా పిటిష న్​లో ఆయన ప్రస్తావించారు.  కాగా, ఈ పిటిషన్‌‌‌‌లో కొన్ని లోపాలున్నాయని, అవి క్లియర్​ అయిన తర్వాత విచారణ కోసం లిస్ట్​ చేయనున్నట్టు కోర్టు వెల్లడించినట్టు తెలిసింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గురువారం కేజ్రీవాల్‌‌‌‌ను అరెస్టు చేసిన ఈడీ.. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. దీనిపై విచారణ జరుగుతోంది.