
గుండాల, వెలుగు : గుండాల మండల అభివృద్ధికి కృషి చేస్తున్నానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఇల్లెందు, గుండాల వయా శెట్టిపల్లి మీదుగా ఆర్టీసీ బస్సును ప్రారంభించి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు శెట్టిపల్లి గ్రామానికి వచ్చి ఇచ్చిన హామీ మేరకు బస్సును తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోడెం ముత్యమాచారి, సీనియర్ లీడర్ పొంబోయిన ముత్తయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఊకే బుచ్చయ్య, ఎస్కే ఖదీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.