పిట్టీ ఇంజనీరింగ్​లాభం రూ.24.83 కోట్లు

పిట్టీ ఇంజనీరింగ్​లాభం రూ.24.83 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: నగరానికి చెందిన పిట్టీ ఇంజనీరింగ్​ కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో​రూ.247.51 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్​లో వచ్చిన రూ.271.39 కోట్లతో పోలిస్తే ఇది 8.80శాతం తగ్గింది.  ఇబిటా 14.67శాతం వృద్ధితో రూ. 40.56 కోట్లకు చేరింది. నికర లాభం 25.47శాతం పెరిగి రూ. 19.79 కోట్ల నుంచి రూ. 24.83 కోట్లకు ఎగిసింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 1,100.17 కోట్లుగా ఉంది.

ఇది 15.34శాతం పెరిగింది.  ఇబిటా రూ. 132.63 కోట్ల నుంచి రూ. 151.39 కోట్లకు పెరిగింది. వార్షికంగా ఇది 14.15శాతం అధికం.  నికర లాభం రూ.58.83 కోట్లు వచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 51.89 కోట్లతో పోలిస్తే ఇది 13.35శాతం వృద్ధిని సాధించింది. తాజా క్వార్టర్​లో ప్రతి మెట్రిక్​ టన్నుకు ఇబిటారూ. 42,290 ఉంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ. 5  ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 1.20 ఫైనల్​ డివిడెండ్‌‌‌‌ని సిఫార్సు చేసింది.