శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి

శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి

శ్రీశైలం డ్యామ్ ముందు భాగంపై ఐకానిక్ బ్రిడ్జికి ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం భూ సర్వే చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని ఈగలపెంట నుంచి ఏపీలోని శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో ప్రస్తుతం అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆమోదిస్తే ఏప్రిల్‌, మే నెలల్లో వీటికి కూడా టెండర్లు ఆహ్వానించనున్నారు. పర్యాటక శాఖ ఒక్కో ప్రాజెక్టుకు రూ.400 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది.

తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలం మధ్య రూ.400 కోట్ల అంచనాతో ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పచ్చజెండా ఊపింది. భూ సర్వే కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ నివసిస్తున్న రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు, మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వే చేస్తున్నారు. లోకల్ గా ఉండే వారి అభిప్రాయాలు, సలహాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Also Read :- దసరా పండుగకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు

సర్వే పూర్తయ్యాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శ్రీశైలం డ్యామ్ ముందు భాగంపై ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నాయి. ఒకవేళ ఈ బ్రిడ్జి ఏర్పాటయితే... పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కొంతమేర ట్రాఫిక్​ సమస్య కూడా తగ్గే చాన్స్ ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. శ్రీశైలం వెళ్లే దూరం కూడా తగ్గనుంది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్​ పర్యాటక శాఖ కూడా టూరిస్టులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. టూరిస్ట్​ ప్రాంతాలను డెవలప్ చేస్తోంది.