జగిత్యాలలో సీజ్ చేసిన .. ప్లాస్టిక్ మాయం

జగిత్యాలలో సీజ్ చేసిన .. ప్లాస్టిక్ మాయం
  •      సీజ్​ చేసిన 10టన్నుల్లో సుమారు 5టన్నులకు పైగా మాయం 
  •      మామూళ్ల మత్తులో అధికారులు 
  •      యథేచ్ఛగా ప్లాస్టిక్ అమ్మకాలు
  •      అన్అఫిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిషేధం ఎత్తివేత?

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో సీజ్​ చేసిన ప్లాస్టిక్​ మెటీరియల్​ మాయమవుతోంది. తనిఖీలు చేసిన టైంలో పలు దుకాణాల్లో సీజ్​చేసిన సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ రికార్డుల్లో నమోదు చేయకపోవడం.. ఆ తర్వాత మాయమవడం జిల్లాలో సంచలనంగా మారింది. మరోవైపు జిల్లాలో యథేచ్ఛగా సింగిల్ ​యూజ్​ప్లాస్టిక్​ అమ్మకాలు సాగుతున్నాయి. ఏడాది కింద ఈ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెంట్రల్​గవర్నమెంట్​నిషేధించగా కొన్ని రోజులు అధికారులు బాగానే కట్టడి చేశారు.

కాగా కొంతకాలంగా కొందరు అధికారులు మామూళ్లకు అలవాటుపడి అన్అఫిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్లాస్టిక్​అమ్మకాలను ఎంకరేజ్​చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ప్లాస్టిక్​అమ్మకాలు జగిత్యాల, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణాల్లో ఎక్కువగా ఉన్నాయి. టీ స్టాల్స్,  టిఫిన్ సెంటర్లు, , జ్యూస్ పాయింట్స్, కిరాణా షాపులు.. అన్నింట్లోనూ ఇష్టమొచ్చినట్లు ప్లాస్టిక్​ వాడుతున్నారు. 

బ్యాన్​ చేసినా విచ్చలవిడిగా తయారీ

గతేడాది జులైలో సింగిల్ యూజ్ 1.20 మైక్రాన్ల కన్న తక్కువ మందమున్న ప్లాస్టిక్ ను సర్కార్ బ్యాన్​చేసింది. ఈ క్రమంలో సింగిల్​యూజ్​ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే ఇండ్రస్ట్రీలకు పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. నిషేధానికి ముందు పర్మిషన్ తీసుకున్న కొందరు వ్యాపారులు బల్దియా అధికారులను మేనేజ్ చేస్తూ ఇప్పటికీ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.  జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్ పల్లి బల్దియాల్లో దాదాపు రూ. 3 కోట్ల దందా జరుగుతోంది.

చిన్న షాపుల్లో అమ్ముతున్న ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేస్తున్న ఆఫీసర్లు.. ఆ షాపులకు సరఫరా చేస్తూ రూ.కోట్లల్లో టర్నోవర్ చేస్తున్న బడా వ్యాపారులను మాత్రం ముట్టుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ ప్లాస్టిక్ గోదాముల సమాచారం ఉన్నప్పటికీ అధికారులు దాడులు చేయడం లేదని అంటున్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలకంగా వ్యవహరించే కొంతమంది అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టడంతోనే ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

సీజ్ చేసినా రికార్డుల్లో నమోదు చేయలే

గతంలో పనిచేసిన మున్సిపల్ ఆఫీసర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మే షాపులపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా గతంలో జగిత్యాల కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న స్వరూప రాణి రెగ్యులర్ గా తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ వాడకాన్ని కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కొంతకాలానికి ఆమె బదిలీ అయ్యారు. అనంతరం కొందరు అవినీతి ఆఫీసర్లు మామూళ్లకు అలవాటు పడి ప్లాస్టిక్​ఉత్పత్తి, వినియోగంపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి.

గతంలో సీజ్ చేసిన 10 టన్నుల్లో ఇప్పటికే 5టన్నులకు పైగా నిషేధిత కవర్ల డంప్ మాయమైనట్లు సమాచారం. సీజ్డ్​ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రికార్డులు మెయింటెయిన్​చేయకపోవడం, సీజ్ చేసిన డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు.. బల్దియా ఆధీనంలో ఉన్న డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తేడాలు రావడం అనుమానాలకు తావిస్తోంది. జగిత్యాల బల్దియాతోపాటు, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీల్లోనూ షాపు ఓనర్లకు వేసిన ఫైన్ల లెక్కలు తప్ప.. సీజ్​చేసిన కవర్ల లెక్కలు రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై అనుమానాలున్నాయి. 

సీజ్ చేసిన నిషేధిత ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డంప్ చేశాం

సర్కార్​నిషేధించిన సింగిల్ యూజ్ వాడుతున్న షాపులకు ఫైన్లు వేస్తున్నాం. ఆ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీజ్​చేసి షాపులకు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఫైన్ వేస్తున్నాం. గతంలో సీజ్ చేసిన కవర్ల డంప్ ను నల్లగుట్ట డంపింగ్ యార్డులో భద్రపరిచాం.  

- అనిల్ బాబు,జగిత్యాల మున్సిపల్​కమిషనర్