పండిట్ ల క్రికెట్ మ్యాచ్ కు నెటిజన్లు ఫిదా 

పండిట్ ల క్రికెట్ మ్యాచ్ కు నెటిజన్లు ఫిదా 

మనదేశంలో క్రికెట్ కు ఉన్నక్రేజ్ మరే ఆటకు లేదు. మెజార్టీ ప్రజలు దీన్ని ప్రేమించడమే కాదు.. ఆరాధిస్తారు కూడా. అయితే మధ్యప్రదేశ్ లోని పండిట్‎లు వినూత్న పద్ధతిలో క్రికెట్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. వారి సంప్రదాయ పద్ధతిలో ధోతీ, కుర్తా ధరించి క్రికెట్ ను అద్బుతంగా ఆడారు. మహర్షి మహేష్ యోగి 104వ జయంతిని పురస్కరించుకుని భోపాల్ లోని  అంకూర్ స్టేడియంలో మహర్షి కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లందరూ పండిట్ లు, సంస్కృతం విద్యను అభ్యసించే  విద్యార్థులే కావడం గమనార్హం. వారందరూ ధోతీ,  ఆరెంజ్ కలర్, తెలుపు రంగులోని టీ షర్ట్స్ ధరించి ఆటలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా క్రీడాకారులందరూ నుదిటిపై తిలకం పెట్టుకుని క్రికెట్ మ్యాచ్ ఆడారు. అంపైర్ కూడా ధోతీ, కుర్తా, భుజంపై శాలువా ధరించాడు. వీరి క్రికెట్ మ్యాచ్ ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.


READ MORE

తమిళ జంట వెరైటీ రిసెప్షన్