జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం

కొడంగల్, వెలుగు: వర్కింగ్​జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కొడంగల్​ప్రెస్​ క్లబ్​సభ్యులు కోరారు. శుక్రవారం కొడంగల్​పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్​రెడ్డికి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నో ఏండ్లుగా కొడంగల్​లో పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులు ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదన్నారు. సీఎం రేవంత్​రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానిక పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు. కార్యక్రమంలో కిషన్​రావు, కత్తి ప్రభాకర్​, పృథ్వీరాజ్​, పకీరప్ప, శ్రీనివాస్, రమేశ్, ప్రసాద్, గోపాల్, నరేందర్, నరేశ్, శ్రీకాంత్, రాకేశ్​ పాల్గొన్నారు.