క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో రైతుల‌కు పీఎం కిసాన్ డ‌బ్బులు

క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో రైతుల‌కు పీఎం కిసాన్ డ‌బ్బులు

వరంగల్ అర్బన్ : ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. శుక్ర‌వారం ఆయ‌న వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ హాస్పిట‌ల్స్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బండి సంజ‌య్..వ‌రంగ‌ల్ ఎంజీఎం, కరీంనగర్ సివిల్ హాస్పిట‌ల్ ఎది చూసినా బాధ కలుగుతుందన్నారు. కోవిడ్ వార్డులు.. సాధారణ వార్డుల కంటే అధ్వానంగా ఉన్నాయ‌న్నారు. సిబ్బంది కోరత వేధిస్తుందని..డాక్ట‌ర్ శోభారాణి, న‌లుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మృతి చెందినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రోజు రోజుకి పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో సిబ్బందిపై పని భారం పడుతుందన్నారు. వైద్య సిబ్బంది, పార మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల‌న్నారు. మానవత ఉద్దేశంతో సేవలు అందించే వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. మేము రాజకీయ కోణంలో విమర్శించడం లేదని... అన్ని విధాల సహకరిస్తామన్నారు. వారికి కుటుంబాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌ మరణాల సంఖ్య , కరోనా బాధితుల సంఖ్య తక్కువ చేసి చూపుతుంద‌న్నారు. పీఎం కేర్స్ పండ్ నుంచి 100 వెంటిలేటర్స్ కేంద్రం ఇచ్చినా.. వాటిని వినియోగించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ లో పీపీఈ కిట్లు, స‌ర్జిక‌ల్ మాస్కులు లేవ‌న్నారు. రెమిడిసివర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తుందని..పేషంట్లను కాపాడే ప్రయత్నం చేయాల‌న్నారు. అన్ని ఉన్నాయని రాష్ట్రం చెబుతున్నా  కొరత స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌న్నారు.


దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో ఇబ్బంది పడ్తున్న ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి మోడీ ఈ రోజు రైతుల అకౌంట్లల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన డబ్బులు వేశార‌న్నారు. 2018 నుండి ఇప్పటి వరకు డబ్బులు ఎప్పుడూ అపలేదని..దేశములో ఉన్న అందరి అకౌంట్లాల్లో, తెలంగాణలో 9.5 లక్షల మంది రైతుల అకౌంట్లలో మ‌నీ ట్రాన్స్ ఫ‌ర్ అయ్యాయ‌ని తెలిపారు. 8వ విడ‌త‌లో.. ఎక్కడా లైన్ లలో నిలబడకుండా డైరెక్ట్ గా రైతుల అకౌంట్ల‌లో వేశామ‌న్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని.. ఎరువుల కొరత రాకుండా బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించామ‌న్నారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతున్నామ‌ని తెలిపారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో రైతుబంధు ప్రారంభించారని.. పెండింగ్ లో ఉన్న రైతుబంధు అందరికీ ఇవ్వాలని, ఎలక్షన్స్ వచ్చిన ఏరియాలో కాకుండా అన్ని ఏరియాల్లో వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రైతు రుణ మాఫీ చేయాలన్న బండి సంజ‌య్.. బకాయిలు అన్ని రైతులకు సకాలములో వారి ఖాతాల్లో జమ చేసి , ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామ‌న్నారు.