అనంత రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2లక్ష నష్టపరిహారం

అనంత రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2లక్ష నష్టపరిహారం

ఏపీలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త విని తీవ్ర ఆవేదనకు గురయ్యానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ప్రధాని. మృతుల కుటుంబాలకు రెండులక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామన్నారు. ప్రధాని మంత్రి నేషనల్ రిలీఫ్ పండ్ తరపున మృతుల కుటుంబాల్ని ఆదుకుంటామన్నారు మోడీ. 

అనంతలో పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన పెళ్లి బృందం కారులో వెళ్తున్నారు. ఉరవకొండ మండలం సమీపంలో ఈ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు, అధికారులు. మృతులంతా అనంతపురం టౌన్‌కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. కంటైనర్ లారీ అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.