‘నేషనల్ గంగా కౌన్సిల్’ తొలి సమావేశంలో పాల్గొన్న మోడీ

‘నేషనల్ గంగా కౌన్సిల్’ తొలి సమావేశంలో పాల్గొన్న మోడీ

ప్రధాని మోడీ అధ్యక్షతన నేషనల్ గంగా కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది. కాన్పూర్ లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్శిటీలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. గంగానదిలో కాలుష్య నియంత్రణ, పునరజ్జీవం కోసం 2014లో 20 వేల కోట్లు కేటాయించారు. చంద్రశేఖర్ ఆజాద్ వర్శిటీలో దీనిపై ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 3 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. బిహార్ నుంచి డిప్యూటీ సీఎం వచ్చారు. గంగా కౌన్సిల్ లో యూపీ, బెంగాల్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు, 9 మంది కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సభ్యులుగా ఉన్నారు.