ప్రధాని మోడీకి UAE అత్యున్నత పురస్కారం

ప్రధాని మోడీకి UAE అత్యున్నత పురస్కారం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పురస్కారమైన ‘జాఎద్ మెడల్’ ను ప్రధాని మోడీకి అందజేస్తున్నట్లు తెలిపారు యూఏఈ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్. ఇందుకు గాను గురువారం ఒక ప్రకటనను చేశారు. ఈ అవార్డును ప్రపంచంలోని దేశాధిపతులకు, ప్రధానులకు ప్రదానం చేస్తారు. ఇందుకుగాను మహ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు. “ యూఏఈ, భారత్ మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి ప్రధాని మోడీ కృషి చేశారు. ఇరు దేశాల చరిత్రలో ఇప్పటి బంధం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ కృషికి ప్రతీగా.. యూఏఈ రాజు ప్రధాని మోడీకి ‘జాఎద్ మెడల్’ తో సత్కరించనున్నారు” అని ట్వీట్ చేశారు. మోడీ కంటే ముందు ఈ అవార్డును రష్యా అధ్యక్షుడు పుతిన్ (2007), చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (2018), సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ (2016) అందుకున్నారు.