
కరోనా వైరస్ విస్తరించకుండా కట్టడి చేయటంలో ఇండియా ముందు వరుసలో నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంక్షోభ సమయంలో దేశ ప్రజలందరిలో భరోసా నింపుతున్నాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలోని 130 కోట్ల మందిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు హాట్ టాపికయ్యాయి. ఇండియా ఎక్కువ జన సాంద్రత ఉన్న దేశం కావటంతో వ్యాధి సోకితే భారీముప్పు ఖాయమని కేంద్రం ముందే అప్రమత్తమవటం మంచి ఫలితాలనిస్తోంది. ముందు జాగ్రత్తను మించిన మందు లేదనే సందేశాన్ని ఇంటింటికీ చేరవేయటంలో ‘మోడీ మంత్ర’ సక్సెస్ అయింది. ప్రధాని మోడీ స్వయంగా పిలుపునిచ్చిన సంఘీభావ కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. గడిచిన నెల రోజులుగా కేంద్రం వ్యవహరించిన తీరు, వివిధ దేశాలతో సంప్రదింపులు, మోడీ తీసుకున్న నిర్ణయాలన్నీ అంతర్జాతీయస్థాయిలో ఇండియాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.
విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా సో కినట్లుగుర్తించిన కేంద్రం మొదట్లోనే అలర్ట్ అయింది. మార్చి తొలివారంలో దేశంలో కరోనా పాజిటివ్ కే సులు నమోదవగానే రంగంలోకి దిగింది. ప్రధాని మోడీ మార్చి 19న టీవీ ప్రసంగంలో.. ప్రపంచమంతా ఎదు ర్కొంటు న్న కరోనా సంక్షోభాన్ని సీరియస్ గా తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశారు.
అదే నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ పాటించాల ని.. ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఎవరికి వారే కర్ఫ్యూ విధించుకోవాలని పిలుపునిచ్చారు . రిస్క్ టైమ్ లో పని చేస్తున్న వారికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని కోరారు. మోడీ పిలుపుతో
స్వ చ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. దీంతో వైరస్ కట్టడిలో అత్యంత కీలకమైన సోషల్ డిస్టెన్స్ .. పట్నాల నుంచి పల్లెల వరకు ప్రచారమైంది. ఆ రోజు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు లన్నింటినీ నిలిపేశారు.
లాక్ డౌన్ అసలైన మందు
కరోనా వ్యాధి కి మందు లేకపోవటం.. సోషల్ డిస్టెన్స్ ఒక్కటే నివారణోపాయం కావటంతో మార్చి 24న రాత్రి ప్రధాని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రజల ప్రాణాల కంటే ఎక్కువేమీ లేదని, దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇండ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని, మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చారు. ముందుచూపుతో లాక్ డౌన్ ప్రకటించడం ఇతర దేశాలతో పోలిస్తే కరోనా తో ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా దేశాన్ని కాపాడుతోంది. కరోనా వైరస్ విస్తరించే తీవ్రతను ఇది తగ్గుము ఖం పట్టించింది.
స్ఫూర్తి జ్యోతి
కరోనా బారినపడ్డవారిని గుర్తించటం, విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్చేయటం, కరోనా ట్రీట్మెంట్కు తగి నన్ని వైద్యసదుపాయాలు కల్పించటంలో కేంద్ర ప్రభుత్వం యాక్టీవ్ రోల్ పోషించింది. అదే టైమ్ లో స్వయంగా మోడీ పిలు పునిచ్చిన జనతా కర్ఫూ, సంఘీభావ సంకేతం, ఈ నెల 5న తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి.. దీపాలు వెలిగించాలనే స్ఫూర్తి జ్యోతి కా ర్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి. ఇవన్నీ ప్రజల్లో అవగాహన కల్పించడం తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంచేశాయి. కరోనా కట్టడిలో మోడీ మంత్ర
అమెరికా సహా ఇతర దేశాలకు అండగా..
కరోనా సంక్షోభ సమయంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇండియా అండగా నిలిచింది. ప్రధాని మోడీ ముందుకు వచ్చి.. ఆ దేశానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్మెడిసిన్సర ఫరాకు అంగీకరించారు. ఇటీవల దేశంలో కరోనా కేసులు పెరగటంతో ఈ మెడిసిన్ ఎగుమతులపై కేంద్రం బ్యాన్ విధించింది. అయితే.. ఈ మందు త మకు ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్మోడీకి ఫోన్ చేసి కోరారు. స్పందించిన మోడీ.. 2.99 కోట్లహైడ్రాక్సీ క్లోరోక్వీన్డోస్లను అమెరికాకు పంపించారు. మోడీ చేసిన సాయాన్ని ట్రంప్ ప్రశంసించడంతో ప్రపంచమంతా ఇండియా వైపు చూసింది. ఈ మందు తమకు పంపించాలంటూ బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా మన దేశాన్ని అభ్యర్ధించారు. . ఇప్ప టి కే స్పెయిన్ కు కరోనా మెడికల్ కిట్లను మన దేశం పంపించింది. మన అవసరా లు తీరిన తర్వాతే.. మానవతా దృక్పథంతో కొన్నిదేశాలకు సాయంచేస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. ఈ ఎగుమతులన్నీ అంతర్జా తీయ స్థాయిలో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని చాటడంతోపాటు మోడీ డిప్లొమాటిక్గా వ్యవహరిస్తున్నారనే గుర్తింపు తెచ్చాయి.
ఈఎంఐల వాయిదా..పీఎం కేర్స్ విరాళాలు
లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. రిజర్వు బ్యాంక్ మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లింపులను వాయిదా వేసింది. అదే సమయంలో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్, పేదలను ఆదుకునే కార్యక్రమాల కోసం విరాళాల సేకరణకు ప్రధాని పిలుపుని చ్చారు. ఈ పీఎం కేర్ కు సామాన్యుడు మొదలు కార్పొరేట్ దిగ్గజాల వరకు విరాళాలు ఇచ్చేం దుకు ముందుకు వస్తున్నారు. ఎంపీల జీతాల్లో కోత విధించటంతోపాటు రెండేండ్లవరకు ఎంపీ ల్యాడ్స్ నిలిపివేసి వాటిని కరోనా కట్టడి కోసం వాడుతున్నట్లు స్పష్టంచేసింది.
అందరితో చర్చలు
కరోనా కష్టకాలంలో మోడీ నేరుగా జనంతో మాట్లాడటంతోపాటు అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తెలుసుకోవటం ప్రాధా న్యం సంతరించుకుంది. ఫెడరల్స్ఫూర్తిని చాటడంతో పాటు అన్ని రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉందనే భరోసాను ఆయన కల్పిస్తు న్నారు. మార్చి 29న మన్ కీ బాత్లో భాగంగా ప్రధాని
గ్రౌండ్ లెవల్లో జనంతో ముచ్చటిం చారు. రాష్ట్రంలో కరోనా బారినపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సికింద్రాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మాట్లాడారు. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లతోనూ మాట్లాడారు. ఏప్రిల్2న, 8న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రంగాల వారితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. కరోనా కట్టడి కోసం వారి సలహాలు స్వీకరిస్తు న్నారు. ఈ పోరాటంలో అందరూ భాగస్వాము లు కావాలని పిలుపునిస్తున్నారు. పొలిటికల్ పార్టీల పార్టీ లీడర్లతోనూ మాట్లాడుతున్నారు. ఎప్ప టికప్పుడు పరిస్థి తిని అంచనా వేస్తున్నారు.
1.70 లక్షల కోట్ల మెగా ప్యాకేజీ
కరోనా ఎఫెక్ట్ తో ప్రజలకు ఇబ్బందులు రావొద్దని భావించిన కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల మెగా ప్యాకేజీని ప్రకటించింది. గరీబ్ కళ్యాణ్ యోజన పేరిట దీన్ని అమల్లోకి తెచ్చింది. 80 కోట్ల మందికి 3 నెలల పాటు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, కిలో చొప్పున పప్పు ఫ్రీగా ఇవ్వటంతో పాటు రైతుల ఖాతాల్లో రూ. 2,000, మహిళల జన్ధన్ ఖాతాల్లో 3 నెలల పాటు ప్రతి నెల రూ. 500, వృద్ధు లు, దివ్యాంగులు, వితంతువుల ఖాతాల్లో రూ. 1,000 జమ చేస్తు న్నట్లు ప్రకటించింది. ప్రస్తు త కష్టకాలంలో రైతుల నుంచి జన్ ధన్ యోజన అకౌంట్లు ఉన్న మహిళల వరకు.. గ్రామీణ ఉపాధి హామీ కూలీల నుంచి చిన్న చిన్న ఉద్యోగస్తు ల వరకు.. ఇలా అందరికీ గరీబ్ కల్యాణ్ యోజన ఉపయోగపడుతోంది. ఇటు భవన నిర్మాణ రంగ కార్మికు లకు.. అటు పేషంట్ల కు ట్రీట్మెంట్ ఇస్తు న్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరికీ కేంద్రం అండగా నిలుస్తోంది.