భయమొద్దు.. బయటపడతాం!

భయమొద్దు.. బయటపడతాం!
  • ఎకానమీ స్లో డౌన్‌పై ప్రధాని మోడీ
  • డిక్రిమినలైజ్ ప్రొవిజన్ తెస్తామని ప్రకటన
  • కార్మికుల హక్కులపై భరోసా

న్యూఢిల్లీ: ఎకానమీ కాస్త స్లో అవుతున్నప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని, ఈ పరిస్థితి నుంచి తప్పకబయటపడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా పుంజుకుంటుందని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో అసోచామ్‌ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోసాల వల్లే అన్ని వ్యాపారాలు ఫెయిల్ కావడం లేదని, అన్ని ఫెయిల్యూర్స్‌ను క్రైమ్‌గా పరిగణనలోకి తీసుకోవద్దని ప్రధాని మోడీ అన్నారు.

దేశంలో వ్యాపారాలను మరింత సులుభంగా నిర్వహించేందుకు, కంపెనీస్ యాక్ట్ కింద డీక్రిమినలైజ్ ప్రొవిజన్‌‌ను తెచ్చేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. తాజాగా చేపట్టిన కార్పొరేట్ ట్యాక్స్ రేట్ల కోత, వ్యాపారాలకు ఆల్‌ టైమ్‌ లో రేట్లను ఆఫర్ చేస్తోందని తెలిపారు. కార్మికులను సంరక్షించాల్సి న బాధ్యత తమపై ఉందన్నారు. కంపెనీల రిజిస్టర్‌ను కూడా కొన్ని నెలల నుంచి కొన్ని గంటలకు తగ్గించామని, ఎయిర్‌ పోర్టుల్లో, సీ పోర్టుల్లో మెరుగైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తున్నామని చెప్పారు. ట్రేడ్, ఇండస్ట్రీ సలహాలు, సూచనలు మేరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో పలు మార్పులు చేశామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో గత మూడేళ్లలో కూడా ఇండియా టాప్ 10 దేశాల్లో ఒకటిగా నిలిచిందని మోడీ కొనియాడారు.