ఆసుపత్రిలో లాలూ.. తేజస్వికి మోడీ ఫోన్

ఆసుపత్రిలో లాలూ.. తేజస్వికి మోడీ ఫోన్

ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 74 ఏండ్ల వయస్సున్న ఆయన మెట్లు ఎక్కుతుండగా జారి పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భుజం ఎముక విరగగా, వెన్నెముకకు గాయమైంది. లాలూ ఆరోగ్యం గురించి తెలుసుకొనేందుకు ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్రరంజన్ గగన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారని ఆర్జేడీ సీనియర్ నేత వెల్లడించారు. 

లాలూ ప్రసాద్ ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కోర్టు పర్మిషన్ సైతం తీసుకున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి లాలూ ప్రసాద్ పలు కేసుల్లో దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్పై ఉన్నారు.