
వాషింగ్టన్: అమె రికాకు హైడ్రాక్సి క్లోరోక్విన్ మెడిసిన్ ను పంపించాలని ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ మెడిసిన్ పంపాలని ఇప్పటికే కోరామని, వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని కోరారు. అమెరికాలో కరోనా వైరస్ పేషెంట్లకు ట్రీట్ మెంట్లో హైడ్రాక్సి క్లోరోక్విన్ను పలు ఇతర మందులతో కలిపి వాడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి హైడ్రాక్సి క్లోరోక్విన్‌తోపాటు పలు మెడిసిన్ల ఎగుమతులను గత నెలలో బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. హైడ్రాక్సి క్లో రోక్విన్ ఇవ్వాలని కోరిన ట్రంప్ ఫోన్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ కరోనా వ్యాప్తి, ఎకానమీ పరిస్థితిపై చర్చ అమెరికాలో పెద్ద సంఖ్యలో మరణాలపై మోడీ సంతాపం తెలిపారు.
తర్వాత అమెరికాలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘‘ఇండియా ప్రైమ్ మినిస్ట ర్ మోడీతో మాట్లాడాను. వాళ్లు (ఇండియాలో) పెద్ద మొత్తంలో హైడ్రాక్సి క్లోరోక్విన్ మెడిసిన్ తయారు చేస్తున్నారు. మేం ఇంతకు ముందే ఆర్డర్ చేసిన మేరకు హై డ్రాక్సి క్లోరోక్విన్ మెడిసిన్ను పంపించాలని కోరాను. మెడిసిన్ ను వెంటనే రిలీజ్ చేస్తారని భావిస్తున్నా..” అని చెప్పారు. అయితే ఎంత మొత్తంలో హైడ్రాక్సి క్లోరోక్విన్ కావాలన్నది వెల్లడించలేదు. అమెరికా ఇప్పటికే సుమారు మూడు కోట్ల డోసుల మేర హైడ్రాక్సి క్లోరోక్విన్ ను సేకరించింది. ఇప్పుడు ఇండియా నుంచి కూడా కొన్నికోట్ల డోసుల మేర మెడిసిన్ ఆర్డర్ చేసినట్టు చెప్తున్నారు.
కరోనా పై కలిసి పోరాడుతాం: మోడీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారని, కరోనాపై పోరాటంలో ఇండియా–అమెరికా కలిసి పోరాడాలని నిర్ణయించామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, ఆర్ధిక పరిస్థితులపై చర్చించామని వెల్లడించారు. ఈ మేరకు పీఎం ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా పై పోరులో ఇరు దేశాలు పూర్తిస్థాయిలో సహకరించుకోవాలని ఇద్దరు లీడర్లు అంగీకారానికి వచ్చారు. ఈ మహమ్మారిని నియంత్రించే చర్యలపై చర్చించారు. అధికారులు టచ్ లోనే ఉండాలని నిర్ణయించారు” అని అందులో పేర్కొన్నారు.