కోల్ కతాకు వెళ్లనున్న ప్రధాని మోడీ

కోల్ కతాకు వెళ్లనున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనకుగాను కోల్ కతాకు వెళ్లనున్నారు. కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి  150సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని టూర్ ఖరారైంది. ఇందులో భాగంగా… రేపు, ఎల్లుండి మోడీ కోల్ కతాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై తృణముల్ కాంగ్రెస్ లీడర్లతో మీడియా మాట్లాడగా ఎటువంటి జవాబు చెప్పలేదు. అయితే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంపై మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడిన నేపథ్యంలో కోల్ కతాలో మోడీ టూర్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. వెస్ట్ బెంగాల్ లో పౌరసత్వ చట్టంపై నిరసనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి.