దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్

 దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్

గాంధీనగర్​: ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ సమీపంలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లోని భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని (ఐఎఫ్​ఎస్​సీ) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్ 'ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబీఎక్స్)'ను ప్రారంభించారు. ఈ ఎక్స్చేంజ్ భారతదేశంలో గోల్డ్​ ఫైనాన్సైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా నాణ్యత హామీతో సమర్థవంతమైన ధరల విధానాన్ని సులభతరం చేస్తుంది. అంతే కాకుండా ఎన్​ఎస్​ఈ ఐఎఫ్​ఎస్​సీ–ఎస్​జీఎక్స్​ కనెక్ట్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లను ప్రారంభించనున్నారు. 

ఈ విధానంలో సింగపూర్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎస్​జీఎక్స్​) సభ్యుల నిఫ్టీ డెరివేటివ్‌‌‌‌లపై అన్ని ఆర్డర్‌‌‌‌లు ఎన్​ఎస్​ఈఐఎఫ్​ఎస్​సీ ఆర్డర్ మ్యాచింగ్ ట్రేడింగ్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌కు వెళ్తాయి. గిఫ్ట్​సిటీలో దాదాపు 125 టన్నుల బంగారం, 100 టన్నుల వెండిని నిల్వ చేయవచ్చు. భారత్‌‌‌‌లోకి వచ్చే బులియన్‌‌‌‌ దిగుమతులకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. ఐఐబీఎక్స్‌‌‌‌ వల్ల బులియన్​ వ్యాపారులకు డెరివేటివ్​ ప్లాట్​ఫారమ్ ​లభించడంతో పాటు విలువైన లోహాల నాణ్యతకు భరోసా ఉంటుంది.