మోడీ చరిష్మా ఉన్న నాయకుడు: రజనీకాంత్

మోడీ చరిష్మా ఉన్న నాయకుడు: రజనీకాంత్

మోడీ చరిష్మా వల్లే బీజేపీ అంతటి ఘన విజయం సాధించిందన్నారు తమిళ తలైవా రజనికాంత్. జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్ పేయి, ఎంజీఆర్,జయలలిత చరిష్మా ఉన్న నేతలని.. మోడీ కూడా ఆ కోవకే చెందుతారని అన్నారు. తమిళనాడులో మోడీ ప్రబంజనం లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజీనామా చేయకూడదని అన్నారు. ప్రజా స్వామ్యంలో  ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలన్నారు. రాహుల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అన్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని, తాను హాజరవుతానని తెలిపారు రజనీ .