6జీ విజన్.. డాక్యుమెంటరీని విడుదల చేసిన మోడీ

6జీ విజన్.. డాక్యుమెంటరీని విడుదల చేసిన మోడీ

దేశం.. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. 5జీ టెక్నాలజీ వృద్ధి చెందిన దగ్గరనుంచి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా భారతదేశ నలు మూలల 5జీ నెట్వర్క్ ని విస్తరించాలని టెలికామ్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరో శుభవార్త చెప్పారు. 6జీ టెక్నాలజీ కోసం బిడ్ పెట్టనున్నట్లు ప్రకటించారు. 2030 నాటికల్లా  దేశంలో హై స్పీడ్ 6జీ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

6జీ ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. 6జీ స్పెక్ట్రమ్, పర్మావణం కోసం ఇప్పటినుంచే పనులు మొదలుపెట్టాలని సంబంధిత అధికారులను కోరారు. 6జీ టెక్నాలజీ ఇంప్లిమెంట్ లోకి వస్తే 5జీ కన్నా 100 రెట్లు వేగంగా ఇంటర్నెట్ సేవల్ని పొందగలం. 1 టీబీపీఎస్ వేగంతో ఇంటర్నెన్ ని వినియోగించొచ్చు. రిమోట్ కంట్రోల్ తో నడిపించగల ఫాక్టరీలను కట్టగలం. కీ, డ్రైవర్ లెస్ గా కార్లను నడపగలం. 2022 అక్టోబర్ లో మోడీ 5జీ టెక్నాలజీని ప్రారంభించారు. 5జీ ప్రారంభం అయిప 120 రోజుల్లోనే 125 జిల్లాల్లో 5జీని అందుబాటులోకి తీసుకొచ్చారు.