ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ..అసలేం జరుగుతోంది..?

 ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ..అసలేం జరుగుతోంది..?

ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇవాళ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత వైమానిక దళ సంసిద్ధత, ప్రణాళికపై ప్రధానితో చర్చించారు.

 త్రివిధ దళాల సన్నద్ధతపై ఇప్పటికే వరుస భేటీలు నిర్వహించిన ప్రధాని తాజాగా ఇవాళఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశం నిర్వహించారు. మరోవైపు ఉగ్రదాడితో తమకు సంబంధం లేదంటూనే దాయాది దేశం సరిహద్దు వెంబడి గత పది రోజులుగా కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Also Read  : పోస్టల్​ సర్వీస్​ నిలిపివేత

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో పెలించాలని దృఢ నిశ్చయంతో ఉన్న ఇండియా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పొరుగుదేశంపై ముప్పేట దాడి చేస్తోంది. పాకన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే ఆ దేశ పౌరుల వీసాల రద్దు చేసి పాకిస్తానీయు లను వెనక్కి పంపించింది. దౌత్య సిబ్బందిని తగ్గించింది. అటారి సరిహద్దు మూసివేసింది. పాక్ కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించింది. వ్యాపార ఆంక్షలు విధిం చడంతో పాటు దౌత్యపరంగా ప్రపంచ దేశాలు మద్దతు కూడగట్టి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.