న్యూఢిల్లీ: ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్ వీడీ–-3 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సైంటిస్టులను అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘సైంటిస్టులకు నా అభినందనలు. ఇది చెప్పుకోదగ్గ మైలురాయి. ఇప్పుడు ఇండియా కొత్త లాంచ్ వెహికల్ ను కలిగి ఉండటం సంతోషకరమైన విషయం. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఎస్ఎస్ ఎల్వీ భవిష్యత్ స్పేస్ మిషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రైవేటు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇస్రో సైంటిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎస్ఎస్ఎల్ వీడీ–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు. పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణను ఇది సులభతరం చేస్తుంది” అని అమిత్ షా చెప్పారు.
