షా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు

 షా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు

పద్మశ్రీ అవార్డు అందుకున్న షా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ అవార్డును పొందడానికి 10 సంవత్సరాలు ప్రయత్నించానని కాంగ్రెస్ హయాంలో వస్తుందని ఆశించాను కానీ రాలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక తనకు పద్మశ్రీ ఇవ్వదనుకున్నానని, అందుకోసం ప్రయత్నించడం కూడా మానేశానని అన్నారు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడూ ముస్లింలకు ఏమీ ఇవ్వదని భావించానని తెలిపారు. 

కానీ మోడీ తన అంచనాలు  తప్ప అని నిరూపించారని . దీనికి నేను మోడీకి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.  రాష్టప్రతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షా రషీద్ అహ్మద్ క్వాద్రీ పద్మశ్రీని అందుకున్నారు.  పద్మ అవార్డులు పొందిన వారిని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. షా రషీద్  చెప్పిన మాటలకు మోడీ నవ్వారు. కర్ణాటక లోని బీదర్ కు  చెందిన షా రషీద్ బిద్రివేర్ హస్తకళాకారుడిగా గుర్తింపు పొందారు. 

https://twitter.com/ANI/status/1643626486484574208

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఆధ్యాత్మిక రంగంలో సేవలకుగాను చిన్నజీయర్ స్వామి, సామాజిక సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. పద్మ అవార్డులు అందుకున్న వారందరకీ  కేంద్ర హోమంత్రి అమిత్ షా విందును  ఏర్పాటు చేశారు