26న మ‌న్ కీ బాత్.. ప్ర‌జ‌ల స‌ల‌హాలు కోరిన మోడీ: టోల్ ఫ్రీ నంబ‌ర్ ట్వీట్

26న మ‌న్ కీ బాత్.. ప్ర‌జ‌ల స‌ల‌హాలు కోరిన మోడీ: టోల్ ఫ్రీ నంబ‌ర్ ట్వీట్

ప్ర‌తి నెలలో చివ‌రి ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆలిండియా రేడియో ద్వారా మ‌న్ కీ బాత్ పేరుతో దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఆ సంద‌ర్భంలో ఉండే ప‌రిస్థితులు, జ‌రిగిన కీల‌క ఘ‌ట‌న‌ల గురించి ప్ర‌స్తావిస్తున్నారాయ‌న‌. గ‌త నెల‌లో క‌రోనాపై పోరాడుతున్న అధికారులు, కొంద‌రు సామాన్యులతో మాట్లాడిన మోడీ.. ఆ విష‌యాల‌ను దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ఈ నెలలో 26వ తేదీన ప్ర‌ధాని మోడీ య‌థావిధిగా మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో మాట్లాడ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడే విష‌యాల్లో ప్ర‌జ‌లు ప్ర‌స్తావించాల‌ని కోరుకుంటున్న విష‌యాల‌పై చెప్ప‌డంతో పాటు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరుతూ ట్వీట్ చేశారు.

టోల్ ఫ్రీ నంబ‌ర్, MyGov, NaMo యాప్స్ ద్వారా..

ఈ నెల 26న జ‌రిగే మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల‌ను స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా కోరారు ప్ర‌ధాని మోడీ. టోల్ ఫ్రీ నంబ‌ర్ 1800-11-7800కి ఫోన్ చేసి ఆయ‌న‌కు చెప్పాల‌నుకుంటున్న స‌ల‌హాను ఆడియో మెసేజ్ గా రికార్డ్ చేయాల‌ని చెప్పారు. అలాగే MyGov యాప్ లేదా వెబ్ సైట్, NaMo యాప్ లో సూచ‌న‌ల‌ను రాయ‌డం ద్వారా తెలియ‌జేయొచ్చ‌ని తెలిపారు.